తమిళ స్టార్స్ తమ ట్యాగ్స్ తీసేసుకోవడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. తల పేరు వద్దని అజిత్, పురుచ్చి థళపతి వద్దని విశాల్..ఇలా చాలామంది హీరోలు తమకు అభిమానులు పెట్టుకున్న ట్యాగ్స్ తీసేశారు. ఇప్పుడు నయనతార కూడా తనను లేడీ సూపర్ స్టార్ అని పిలొవద్దని రిక్వెస్ట్ చేస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
నయనతార అని పిలవడమే తనకు ఇష్టమని, లేడీ సూపర్ స్టార్ అని ట్యాగ్ వేయడం నచ్చడ లేదని ఆమె తన ప్రెస్ రిలీజ్ లో తెలిపింది. ఇలా ట్యాగ్ వేయడం వల్ల ప్రొఫెషనల్ గా తనకు తానే ఓ బౌండరీ పెట్టుకున్న ఫీల్ కలుగుతోందని నయనతార తెలిపింది. ఆమె సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది నయనతార.