మరోసారి నయన్ తో చిరు

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి జోడీగా కనిపించబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న 157వ సినిమాకు నాయికగా నయనతారను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించబోతోంది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది. భారీ గ్రాఫిక్స్ హంగులతో హాలీవుడ్ స్టైల్లో ఈ మూవీని తెరకెక్కించాలని డైరెక్టర్ ‌వశిష్ట ప్లాన్ చేస్తున్నారు. సినిమాటిక్ అడ్వెంచర్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు మేము సిద్ధమవుతున్నామంటూ రీసెంట్ గా డైరెక్టర్ ట్వీట్ చేశారు.

ఈ సినిమాలోని హీరోకున్న పవర్ ఫుల్ క్యారెక్టర్ కు జోడీగా నయనతార ఉంటే బాగుంటుందని టీమ్ అనుకుంటున్నారట. గతంలో చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నయనతార నటించింది. ఈ సినిమా టీమ్ లోకి నయన్ వచ్చేస్తే చిరుతో కలిసి ఆమెకు హ్యాట్రిక్ మూవీ కానుంది.