అచ్చతెలుగందం ఈ సత్యభామ

రీసెంట్ గా ఆయ్ (AAY) సినిమాతో బిగ్ సక్సెస్ అందుకుంది యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నయన్ సారిక (Nayan sarika). ఈ జోష్ లో నయన్ సారిక మరో ప్రెస్టీజియస్ మూవీ “క” (KA)లో నటిస్తోంది. కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) హీరోగా నటిస్తున్న ఈ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ లో సత్యభామ పాత్రలో నయన్ సారిక ఆకట్టుకోనుంది.

ఈ రోజు “క” సినిమా నుంచి నయన్ సారిక సత్యభామ (Satyabhama) పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అచ్చతెలుగందం ఈ సత్యభామలో కనిపిస్తోంది. లంగావోణి వేసుకుని పిండిపడుతూ ఎవరి గురించో ఆలోచిస్తోంది సత్యభామ. ఆమెకు సత్యభామ పేరు పెట్టారంటే క్యారెక్టర్ అందంతో పాటు పవర్ ఫుల్ గానూ ఉండబోతోంది అనుకోవచ్చు.

“క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా రిలీజ్ కు రానుంది.