డ్రగ్ కేసులో కోర్టు తలుపు తట్టిన నవదీప్

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నవదీప్ పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కోర్టు తలుపు తట్టాడు. ముందస్తు బెయిల్ కోసం అతను చేసుకున్న పిటిషన్ ను కోర్టు స్వీకరించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈలోగా నవదీప్ ను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నవదీప్ కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు ఈ గ్యాంగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు తెలిసింది. విచారణ చేపట్టిన పోలీసులు నవదీప్ డ్రగ్స్ కొన్నట్లు నిర్థారణకు వచ్చారు. ఈ కేసులో ఏ29గా అతన్ని చేర్చారు. అయితే నవదీప్ పోలీసులకు చిక్కలేదు. అతను అబ్ స్కాండింగ్ ఉన్నాడని పోలీసులు అంటున్నారు.

మొదటి రోజు పోలీసులు చెబుతున్న నవదీప్ నేను కాదంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పిన నవదీప్..ఇప్పుడు తను డ్రగ్స్ తీసుకోలేదని, కావాలంటే టెస్టులకు రెడీ అంటున్నాడు. ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. వెబ్ సిరీస్ లు, మూవీస్ లో బిజీగా ఉన్న నవదీప్ కు ఈ డ్రగ్ కేసులో ఇరుక్కోవడం ఇబ్బంది పెట్టే విషయమే.