పర్పస్ ఫుల్ మూవీస్ చేస్తూ సెన్సబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఆయన లేటెస్ట్ మూవీ కుబేర మూవీ లవర్స్ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. నాగార్జున, ధనుష్, రశ్మిక మందన్న కీ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కూడా లైనప్ చేసుకున్నారు శేఖర్ కమ్ముల.
నాని హీరోగా శేఖర్ కమ్ముల ఓ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుబేర రిలీజ్ అనంతరం వీరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ మూవీ చేస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ తో నానికి మరో మూవీ లైనప్ లో ఉంది.