నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ రిలీజైంది. ఈ గ్లింప్స్ రా అండ్ రస్టిక్ గా కట్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా తర్వాత నానితో చేస్తున్న మూవీ ఇది. దసరా మూవీ కంటే డబుల్ డోస్ లో రా రస్టిక్ నెస్ పెంచి ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్యారడైజ్ గ్లింప్స్ లో కాకుల్లాంటి అణగదొక్కబడిన ప్రజల నాయకుడిగా హీరోను పరిచయం చేశారు.
చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశారు గానీ కాకుల గురించి ఎవరూ రాయలేదంటూ ఈ గ్లింప్స్ మొదలవుతుంది. కాకుల్లా చరిత్ర మర్చిపోయిన కొందరు మనుషులను ముందుకు నడిపే నాయకుడిగా హీరో నానిని పరిచయం చేశారు. బూతు డైలాగ్స్ ఉన్నాయి. తెలంగాణ యాసలోనే ప్యారడైజ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లోనూ ఈ గ్లింప్స్ కట్ చేశారు.