నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యవ్. నానికి జంటగా మృణాల్ ఠాగూర్ నటిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కి విడుదల చేయనున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత మరో సినిమాకి ఓకే చెప్పాడని తెలిసింది. ఇంతకీ ఎవరితో అంటే.. కోలీవుడ్ డైరెక్టర్ సి.బి. చక్రవర్తితో అంటున్నారు. సి.బి. చక్రవర్తి డాన్ సినిమాతో సక్సెస్ సాధించాడు.
ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై ఇపుడు లేటెస్ట్ ప్రోగ్రెస్ బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించనున్నారని టాక్. శ్రీనివాస చిట్టూరి వారియర్, కస్టడీ, స్కంద.. ఇలా వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు నానితో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. అలాగే నాగార్జునతో కూడా భారీ చిత్రం ప్లానింగ్ లో ఉంది. దసరాతో నాని యాక్షన్, మాస్ మూవీస్ కూడా చేయచ్చు అనే పేరు తెచ్చుకున్నాడు. మరి.. ఈ కాంబో ఫిక్స్ అవుతుందేమో చూడాలి.