బిగ్ లైనప్ రెడీ చేసుకున్న నాని

నేచురల్ స్టార్ నాని(Nani).. తనదైన స్టైల్ లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ఇటీవల సరిపోదా శనివారం(Saripoda sanivaram) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. ఇప్పుడు నెక్ట్స్ సినిమాల విషయంలో ఫోకస్ పెట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాలు కన్ ఫర్మ్ చేశాడని.. లైనప్ అదిరింది అని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. అదిరింది అనిపించే నాని లైనప్ ఏంటి..?

హిట్(HIT), హిట్ 2 సినిమాలు.. ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్టర్ చేసిన ఈ థ్రిలర్స్ ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేయడంతో హిట్ 3 చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే.. హిట్ మూవీలో విశ్వక్ సేన్ నటిస్తే.. హిట్ 2 లో అడివి శేష్ నటించాడు. ఇప్పుడు హిట్ 3(HIT 3) మూవీని నానితో చేస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేశాడు. ఈ క్రేజీ థ్రిల్లర్ ను మే 1న రిలీజ్ చేయనున్నట్టుగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం విశేషం.

హిట్ 3 తర్వాత నాని దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేసి జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకురావాలి అనేది నాని ప్లాన్. గత కొన్ని రోజులుగా నాని, సుజిత్(Sujeeth) కాంబో అంటూ ప్రచారం జరుగుతోంది. సుజిత్ చెప్పిన కథకు నాని ఓకే చెప్పాడట. ప్రస్తుతం సుజిత్ ఓజీ మూవీ బిజీలో ఉన్నాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత నానితో చేయనున్న మూవీ పై వర్క్ చేస్తాడని.. ఈ కాంబో ఫిక్స్ అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అలాగే నానితో గౌతమ్ తిన్ననూరి జెర్సీ అనే సినిమా తెరకెక్కించడం.. ఆ సినిమా సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు నాని కోసం గౌతమ్ తిన్ననూరి(Goutham thinnanuri) ఓ స్టోరీ రెడీ చేశాడట. అలాగే శేఖర్ కమ్ముల(Shekar kammula) కూడా నాని కోసం ఓ స్టోరీ రెడీ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో కూడా ఫిక్స్ అని తెలిసింది. మొత్తానికి నాని లైనప్ అదిరింది.