బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్న నాగవంశీ..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి భగవత్ కేసరి అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతుంది. దసరాకి ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు. అయితే.. బాలయ్య నెక్ట్స్ మూవీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే బాలయ్యతో సినిమా చేసేందుకు 14 రీల్స్ సంస్థ, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ తో పాటు మరికొన్ని సంస్థలు పోటీపడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మాత అయిన నాగవంశీ ట్విట్టర్ లో జూన్ 10 అని లయన్ ఎమోజీ పెట్టడం ఆసక్తిగా మారింది. ఈ ట్వీట్ ను బట్టి బాలయ్యతో సినిమా నిర్మిస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పారని.. బాలయ్యతో సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించే చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే.. బాలయ్య తదుపరి చిత్రం బోయపాటి శ్రీనుతో ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు బాబీతో నెక్ట్స్ మూవీ ఉంటుందని వార్తలు వస్తుండడంతో ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది.