ఒకరి కోసం కథ రాస్తే.. మరొకరితో సెట్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతుంటుంది. ఇలాగే నాగార్జున కోసం కథ రాస్తే.. వెంకటేష్ సెట్ అయ్యిందట. ఆ సినిమానే క్లాసిక్ గా నిలిచిపోయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. కొత్త బంగారు లోకం సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాలకు ఎడిటర్ మార్తండ్ కే వెంకటేష్ ఫోన్ చేసిన నాగార్జున గారి కోసం మంచి కథ ఉంటే చెప్పమని అడిగారట. అయితే.. శ్రీకాంత్ అడ్డాల నాగార్జునను కలిసి ఇద్దరు అన్నదమ్ముల కథ ఉందని..అది మల్టీస్టారర్ మూవీ అని చెప్పారట. అయితే.. చూద్దామన్నారట కానీ.. పెద్దగా ఆసక్తి చూపించలేదట నాగ్.
ఆ తర్వాత ఇదే కథ వెంకటేష్, మహేశ్ బాబుకు నచ్చడంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెట్స్ మీదకు వెళ్లింది. ఆ విధంగా నాగార్జున చేయాల్సిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వెంకటేష్ కు దక్కింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. రీసెంట్ గా ఈ సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ తెర వెనక విషయాన్ని వెల్లడించారు.