“కూలీ” సినిమా కోసం నాగార్జునకు భారీ రెమ్యునరేషన్

హీరో నాగార్జున(Nagarjuna) వైజాగ్ లో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajnikanth) కూలీ(Coolie) మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు. లోకేష్ కనకరాజ్(Lokesh kanakaraj) డైరెక్షన్ లో రూపొందుతోన్న కూలీ మూవీ గత కొన్ని రోజులు నుంచి వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర విలన్ గా నటిస్తున్నాడు. అలాగే శృతి హాసన్ రజినీ డాటర్ గా నటిస్తుందని సమాచారం. ఇందులో నాగార్జున నటిస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ భారీ పాన్ ఇండియా మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ మూవీ షూటింగ్ లో నాగార్జున ఈ నెల 9 నుంచి జాయిన్ అయ్యారు. నాగార్జున పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాగార్జున క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని వార్తలు వచ్చాయి. మేకర్స్ స్పెషల్ రోల్ అని ప్రకటించినప్పటికీ.. విలన్ పాత్ర అని కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే నాగార్జున లుక్, క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుందట.

ఈ మూవీ కోసం నాగార్జున తన కెరీర్ లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ 25 కోట్లు తీసుకోవడం విశేషం. సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తుండడంతో ప్రాజెక్ట్ పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఈ భారీ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయనున్నారు.