“కుబేర” నుంచి నాగార్జున బర్త్ డే పోస్టర్ రిలీజ్

ఈ రోజు నాగార్జున(Nagarjuna) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా కుబేర(Kubera) నుంచి బర్త్ డే విశెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాగార్జున కొత్తగా కనిపిస్తున్నారు. ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar kammula) కుబేర సినిమాను రూపొందిస్తున్నారు. నల్లధనం నేపథ్యంతో ముంబై దారావిలో జరిగే కథతో ఈ సినిమా ఉండనుంది.

ధనుష్(Dhanush) ఈ చిత్రంలో బెగ్గర్ క్యారెక్టర్ లో కనిపించనుండగా..నాగార్జున పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్యకు లవ్ స్టోరీతో గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల..కుబేరలో నాగార్జునకు కూడా స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.