నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత

హీరో నాగార్జున(Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్(N convention) సెంటర్ ను పోలీసులు ఈ ఉదయం కూల్చివేశారు. చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ సెంటర్ కట్టారని హైడ్రా అధికారులు చెబుతున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాల కూల్చివేతకు ఇటీవల ప్రభుత్వం హైడ్రా(Hydra) అనే సంస్థను ఏర్పాటు చేసింది. రంగనాథ్ అనే అధికారిని హెడ్ గా నియమించింది.

చెరువుల ఎల్టీఎఫ్ పరిధిలో కట్టిన పర్మిషన్స్ లేని బిల్డింగ్స్ ను ఈ హైడ్రా కూల్చివేస్తోంది. ఇందులో భాగంగా 10 ఎకరాల్లో కట్టిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో 3.5 ఎకరాలు చెరువును ఆక్రమించి కట్టారని హైడ్రా అధికారులు వెల్లడించారు. ఈ 3.5 ఎకరాల్లో కట్టడాలు కూల్చివేశారు. ఈ కన్వెన్షన్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రముఖుల వెడ్డింగ్స్, ఇతర పార్టీలు జరుగుతుంటాయి.