రజినీకాంత్ సినిమాలో నాగార్జున ?

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajnikanth) కూలీ (Coolie) మూవీ నాగార్జున(Nagarjuna) నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది కానీ..మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రజినీ కూలీ మూవీలో నాగార్జున నటిస్తున్నాడని.. ఇందులో ఆయన కీలక పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh kanakaraj) రూపొందిస్తున్నారు.

అయితే తాజాగా రజినీ కూలీ మూవీలో నాగార్జున నటించడం నిజమేనని తెలిసింది. కాకపోతే ఎలాంటి క్యారెక్టర్ అనేది తెలియాల్సివుంది. మరో విషయం ఏంటంటే.. ఈ నెలాఖరు నుంచి నాగ్ ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నాడని సమాచారం. ఓ వైపు కుబేర(Kubera) చేస్తూ.. మరో వైపు బిగ్ బాస్ట్ 8 స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పుడు కూలీ మూవీలో జాయిన్ కానున్నాడు. ఇలా నాగార్జున బిజీగా గడుపుతున్నాడు.