హీరోలు సినిమాలతో పాటు తమకు ఇష్టమైన మరికొన్ని ఫీల్డ్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం చూస్తుంటాం. ఫార్ములా వన్ కార్ రేసింగ్స్ ఇష్టపడే హీరో నాగ చైతన్య కూడా తనకు ఇష్టమైన ఈ రంగంలో ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నాడు. రీసెంట్ గా నాగ చైతన్య మోటర్ స్పోర్ట్ రేసింగ్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ను కొనుగోలు చేశాడు. మోటర్ స్పోర్ట్స్ తనకు ఇష్టమని, ఈ రేస్ ను చూసే వారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోందని నాగ చైతన్య అంటున్నారు.
ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్ షిప్ లో పోటీ పడేందుకు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రెడీ అవుతోంది. తన టీమ్ బాగా పర్ ఫార్మ్ చేస్తుందని నాగ చైతన్య ఆశిస్తున్నారు. మరోవైపు ఆయన తన కొత్త సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాల నేపథ్యంతో సాగనుంది. అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.