నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ ఇదే

యంగ్ హీరో నాగశౌర్య గ్యాప్ తర్వాత మళ్లీ మూవీ అనౌన్స్ చేశారు. ఈరోజు నాగశౌర్య బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ వెల్లడించారు. బ్యాడ్ బాయ్ కార్తీక్ పేరుతో నాగశౌర్య ఈ మూవీ చేస్తున్నారు. టైటిల్ పోస్టర్ లో నాగశౌర్య ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను కొత్త దర్శకుడు రమేష్ దేసిన రూపొందిస్తున్నారు. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది.

వరుసగా ఆరు ఫ్లాప్ మూవీస్ తో డల్ అయ్యాడు నాగశౌర్య. అశ్వత్థామ, వరుడు కావలెను, లక్ష్య, కృష్ణా వ్రిందా విహారి, ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి, రంగబలి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. రంగబలి సినిమా తర్వాత నాగశౌర్య సినిమాలు చేయలేదు. ఈ గ్యాప్ లో నాగశౌర్య వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. ఈ బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమాగా బ్యాడ్ బాయ్ కార్తీక్ నాగశౌర్య కెరీర్ కు కీలకం కానుంది.