దర్శకుడు చందూ మొండేటితో తన కొత్త సినిమా చేస్తున్నాడు హీరో నాగ చైతన్య. ఈ సినిమా కథ మీదున్న నమ్మకం అనుకుంటా..ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. లొకేషన్ హంటింగ్ కోసం స్వయంగా ఉత్తరాంధ్ర వెళ్లాడు. అక్కడి స్థానికులతో ఇంటరాక్ట్ అయ్యాడు. మత్స్యకారుల జీవితాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమా కోసం ఇద్దరు నాయికలను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కీర్తి సురేష్ లేదా సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో టీమ్ ఉన్నారట. పర్ పార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కాబట్టి అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించే కీర్తి లేదా సాయి పల్లవి అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. సాయి పల్లవితే నాగ చైతన్య లవ్ స్టోరిలో నటించాడు.
జీఏ2 పిక్చర్స్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20 నుంచి నాగ చైతన్య, చందూ మొండేటి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. దసరాకు నాలుగు రోజుల ముందే షూటింగ్ కు రెడీ అవుతున్నారు. డైరెక్టర్ చందూ మొండేటి గత సినిమా కార్తికేయ 2 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడుతున్నాయి.