శ్రీకృష్ణ దేవరాయలు చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికీ తెనాలి రామకృష్ణ గుర్తుండే ఉంటాడు. దేవరాయలు దగ్గర ఆస్థాన కవిగా తెనాలి రామకృష్ణ చూపించిన చతురత గురించి ఎన్నో కథలు, సినిమాలూ వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు తెనాలి రామకృష్ణగా నటించి మెప్పించారు. ఇప్పుడా అవకాశం నాగ చైతన్యకు కూడా రాబోతోంది. చైతూ రీసెంట్ మూవీ తండేల్ సక్సెస్ మీట్ లో దర్శకుడు చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
నాగ చైతన్యతో తెనాలి రామకృష్ణ మూవీ చేస్తానని, అది అద్భుతంగా ఉండేలా రూపొందిస్తానని చందూ మొండేటి అన్నారు. ఏఎన్నార్ లా నాగ చైతన్య కూడా ఆ పాత్రలో నటిస్తాడని చందూ మొండేటి చెప్పారు. కార్తికేయ 2 వంటి డివోషనల్ ఇన్వెస్టిగేషన్ మూవీ చేసి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు నాగ చైతన్యతో పర్పెక్ట్ హిస్టారికల్ మూవీ చేయగలడు అనే టాక్ వినిపిస్తోంది.