ఫ్యాన్స్ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేసిన నాగ చైతన్య

హీరో నాగ చైతన్య అభిమానుల దగ్గరకు వెళ్లి వారిని సర్ ప్రైజ్ చేశారు. అభిమానుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. మరికొందరు ఫ్యాన్స్ ను బయట వారు ఉన్న చోటికి వెళ్లి కలిశారు. వారికి గిఫ్టులు ఇచ్చారు. ఈ వీడియోను ప్రైమ్ వీడియో యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా నాగ చైతన్య తన కొత్త వెబ్ సిరీస్ దూత గురించి అభిమానులతో మాట్లాడారు. ప్రతిసారి అభిమానులు తనను కలిసేందుకు వస్తుంటారని, అయితే ఈసారి డిఫరెంట్ గా ఉంటుందని తానే అభిమానుల దగ్గరకు వచ్చానని నాగ చైతన్య చెప్పుకున్నారు.

సూపర్ నేచురల్ కథతో దూత వెబ్ సిరీస్ ను దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందించారు. పార్వతి, ప్రియ భవానీ శంకర్ హీరోయిన్స్ గా నటించారు. అమోజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1 నుంచి దూత స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ గురించి నాగ చైతన్య మాట్లాడుతూ తన కెరీర్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదని చెప్పాడు. సినిమాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయని, అయితేే దూత లో అలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా తాను ఫ్రీగా నటించగలిగానని నాగ చైతన్య చెప్పారు. దూతలో తాను చేసిన సాగర్ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుందని నాగ చైతన్య అన్నారు. ఎల్లుండి నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా దూత ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.