హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ ఓనర్ గా నాగ చైతన్య‌

హీరో నాగ‌చైత‌న్య‌ కార్ రేసింగ్ కాంపిటేషన్ లోకి అడుగుపెట్టారు. రేసింగ్ కార్లను ఇష్టపడే నాగ చైతన్య ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ (ఐఆర్ఎఫ్‌)లో పోటీ ప‌డే హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. ఫార్ములా 4 రేస్ లో నాగ చైతన్య ఫ్రాంఛైజీ పోటీ పడనుంది. ఈనెల 24వ తేదీ నుంచి ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ ప్రారంభం కాబోతోంది.

హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడంతో తన కల నిజమైందని నాగ చైతన్య అన్నారు. ఈ ఫ్రాంఛైజీతో తన ఫ్యాషన్ ఏంటో చూపించుకునే అవకాశం దక్కిందని ఆయన అన్నారు. ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌లో పాల్గొంటున్న ఆరు టీమ్స్‌లో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఒక‌టి. బాలీవుడ్ హీరోలు అర్జున్ క‌పూర్‌, జాన్ అబ్ర‌హం, మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ గంగూలీ కూడా ఈ ఫ్రాంఛైజీలో పార్టనర్స్ గా ఉన్నారు.