హీరో నాగచైతన్య శోభిత దంపతులు తమ మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు ఆశ్రయం ఇచ్చే సెయింట్ జ్యూడ్ చైల్డ్ కేర్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ క్యాన్సర్ బాధిత చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. వారితో ఫొటోస్ తీసుకున్నారు. ఈ సెంటర్ లో చైతూ, శోభిత ఉన్నంతసేపు పిల్లలు హ్యాపీగా కనిపించారు.
సెయింట్ జ్యూడ్ చైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకులతో నాగ చైతన్య, శోభిత మాట్లాడారు. చిన్నారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చైతూ, శోభిత ఈ క్యాన్సర్ సెంటర్ ను సందర్శించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరి మంచి మనసును నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.