నాగార్జున నటిస్తోన్న మూవీ కుబేర. ధనుష్ తో కలిసి నాగార్జున కుబేర మూవీలో నటిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి శేఖర్ కమ్ముల డైరెక్టర్. ఇక చైతన్య నటిస్తోన్న మూవీ తండేల్. చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. అయితే.. కుబేర రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ.. ఫిబ్రవరిలో రిలీజ్ అని టాక్. మరి.. నిజంగానే ఒకే నెలలో నాగ్, చైతూ రానున్నారా..?
నాగచైతన్య కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ ఫిబ్రవరి 7 థియేటర్లలో రానుంది. మీడియా మీట్ ఏర్పాటు చేసి అఫిషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సంక్రాంతికి తండేల్ థియేటర్స్ లోకి రావాలని అభిమానులు కోరుకున్నారు కానీ.. పోటీ దృష్ట్యా అనవసరంగా ఓపెనింగ్స్ దెబ్బ తీసుకోవడం ఇష్టం లేని గీత ఆర్ట్స్ ఫిబ్రవరి 7న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. జనవరి చివరి వారంలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. పలు కారణాల వలన దాన్ని కాదనుకున్నారు.
నాగ్ కుబేర మూవీ టీజర్ ను ఈ నెల 15న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరిలో రిలీజ్ అని తాజా లీక్. ధనుష్ హీరో అయినప్పటికీ.. నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండటంతో మల్టీస్టారర్ లుక్ వచ్చేసింది. లీడర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న సీరియస్ సబ్జెక్టు ఇదే. ఒక బిచ్చగాడు వ్యవస్థను శాశించే శక్తిగా ఎలా మారాడనే పాయింట్ తో రూపొందిందని సమాచారం. ఫిబ్రవరి 14 లేదా 21 రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలిసింది. తండేల్ 7 వస్తుంది. ఈ రెండు సినిమాలు కంటెంట్ ఉన్న బలంగా ఉన్న సినిమాలే. మరి.. ఈ ఆసక్తికర పోటీలో బ్లాక్ బస్టర్ ఎవరు సాధిస్తారో చూడాలి.