విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ “సంతాన ప్రాప్తిరస్తు” ఇన్నోవేటివ్ ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ రాగా..ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ ఫ్రెష్ ట్యూన్స్ తో ఈ ట్రెండ్ ఆడియెన్స్ కు నచ్చేలా సాంగ్స్ కంపోజ్ చేశారు. ఈ రోజు “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి ‘నాలో ఏదో..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
‘నాలో ఏదో..’ పాటకు శ్రీజో లిరిక్స్ అందించగా. సింగర్స్ దినకర్ కల్వల, అదితి భావరాజు ఆకట్టుకునేలా పాడారు. ‘నాలో ఏదో..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ నాలో ఏదో మొదలైందని, నీతో చెలిమే రుజువైందని, కనులే చెబితే మనసే వినదా, నిజమే అనదా…’ అంటూ హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ మేకింగ్ సాంగ్ గా ఆకట్టుకుంటోందీ పాట.
“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రముఖ రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.