వెంకీ, అనిల్ రావిపూడి సినిమా ముహూర్తం ఫిక్స్

వెంకటేష్ (venkatesh) హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil ravipudi) రూపొందించబోయే సినిమాకు ఎల్లుండే ముహూర్తం ఖరారైంది. ఈ సినిమాను ఎల్లుండి లాంఛనంగా ప్రారంభించి రెగ్యులర్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేయాలని దర్శకుడు అనిల్ ప్లాన్ చేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు (Dil raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi chowdary) హీరోయిన్ గా నటిస్తోంది.

ఎఫ్ 2 (F2), ఎఫ్ 3 (F3) తర్వాత వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రమిది. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దాంతో వెంకీ, అనిల్ కాంబో మూవీపై ఎక్స్ పెక్టేషన్ బాగానే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ ఈ చిత్రంలో మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.