‘ముఫాసా’గా మహేశ్ డైలాగ్స్ అదుర్స్

యానిమేషన్ మూవీస్ కు టాప్ ప్రొడక్షన్ కంపెనీ డిస్నీ(Disney). ఈ సంస్థ నుంచి వస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్(Mufasaa, the lion king). ఈ సినిమా తెలుగు వెర్షన్ లో ముఫాసా క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu). ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. ఈ ట్రైలర్ లో మనం ఒక్కటిగా పోరాడాలి అంటూ మహేశ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి.

మరోవైపు టిమోన్(Timon) కు అలీ, పుంబా(Pumbaa)కు బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్ నవ్విస్తోంది. ముఫాసా ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న రిలీజ్ కు రెడీ అవుతోంది. అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. హిందీలో ముఫాసా క్యారెక్టర్ కు షారుఖ్ ఖాన్(Sharukh khan) డబ్బింగ్ చెప్పగా..తెలుగులో మహేశ్ బాబు(Mahesh babu) వాయిస్ ఇచ్చారు.