“మిస్టర్ బచ్చన్” ఓటీటీ డేట్ ఫిక్స్

రవితేజ(Raviteja) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr bachan) డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ నెల 12వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. వినాయకచవితి సందర్భంగా ఈరోజే మిస్టర్ బచ్చన్ డజిటల్ ప్రీమియర్ ఉంటుందనే టాక్ గతంలో వినిపించింది. అయితే అఫీషియల్ గా నెట్ ఫ్లిక్స్ 12వ తేదీని అనౌన్స్ చేసింది.

రవితేజతో దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) రూపొందించింది. ఈ సినిమా బాలీవుడ్ మూవీ ది రైడ్ కు తెలుగు రీమేక్ గా రూపొందింది. బాలీవుడ్ లో హిట్ మూవీ ఇక్కడ రీమేక్ లో మాత్రం ఫ్లాప్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ తమ సంస్థకు భారీగా నష్టాలు తీసుకొచ్చిందని ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మీడియా ముందే చెప్పాడు. ఈ సినిమాకు వచ్చిన లాస్ వల్ల దర్శకుడు హరీశ్ శంకర్ తన రెమ్యునరేషన్ నుంచి 2 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. థియేటర్ లో మిస్టర్ బచ్చన్ మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు.