చేయాల్సింది చాలానే ఉందట

ఇటీవల నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటింది పుష్ప 2 సినిమా. అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్, పాటలకు దేవిశ్రీ ప్రసాద్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ దక్కాయి. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా సృష్టించిన బాక్సాఫీస్ సెన్సేషన్ గురించి తెలిసిందే. పుష్ప 2 సినిమాకు సౌత్ స్టేట్స్ కంటే ఎక్కువ క్రేజ్ బాలీవుడ్ లోనే కనిపించింది. అక్కడ వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

పుష్ప 2 మీద నేషనల్ వైడ్ నెలకొన్న హైప్ ను ఇటీవలి నేషనల్ అవార్డ్స్ మరింతగా పెంచాయి. దీంతో ఈ సీక్వెల్ ను మరింత జాగ్రత్తగా తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ అండ్ టీమ్ భావిస్తున్నారట. అందుకే కొంత ఆలస్యమైనా పర్పెక్ట్ ఔట్ పుట్ తేవాలనే ఆలోచనతోనే రిలీజ్ డేట్ మరింత వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన పుష్ప 2 మూవీని ఆగస్టు 15కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

పుష్ప 2 ఇప్పటిదాకా సగం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఇటీవల సెట్స్ నుంచి లీక్ అయిన స్టిల్స్ చూస్తుంటే మేకింగ్ చాలా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 నుంచి మరో విషయం వైరల్ అవుతోంది. అదే ఈ సినిమాకు రీసెంట్ గా రిలీజ్ చేసిన డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ నుంచి హైలైట్ చేసిన పింక్ నెయిల్. ఈ పింక్ గోరునే ప్రతి పోస్టర్ లో హైలైట్ చేయడం వెనక ఓ రీజన్ ఉందని టాక్ వినిపిస్తోంది. అదేంటో ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.