మైథాలజీ మూవీస్ ఆగడం లేదు

మన సినిమాల కథలు చాలా వరకు పౌరాణికాల్లోని ఏదో ఒక అంశం నుంచి ఇన్ స్పైర్ అయినవే. ఒక్క మహాభాారతం చదివితే వెయ్యి కథలు రాసుకోవచ్చని ఆ మధ్య ఓ డైరెక్టర్ అన్నారు. ఇన్ స్పైర్ చేయడం ఒకటైతే..నేరుగా అవే కథల్ని భారీ హంగులతో ఇవాళ్టి ఆడియెన్స్ కు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఇలాగే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

తాజాగా బాలీవుడ్ లో రామాయణంను మరో భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, యష్ కీలక పాత్రల్లో నటించనున్నారు. సాయి పల్లవి సీత క్యారెక్టర్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఇక మరో పౌరాణిక నేపథ్య సినిమా కర్ణ కూడా చర్చల్లో ఉంది. ఈ సినిమాలో కర్ణుడి క్యారెక్టర్ లో తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్నారు.

కర్ణ సినిమాను డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా రూపొందించనున్నారు. కొద్ది రోజుల కిందట ముంబై వెళ్లిన సూర్య డైరెక్టర్ ను కలిసి చర్చలు జరపడం రూమర్స్ కు మరింత బలాన్నిచ్చింది. మన పౌరాణిక గాథలు ఇలాగైనా ఇవాల్టితరం ప్రేక్షకులు తెలుస్తున్నాయి.