మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ అని బాలకృష్ణ ప్రకటించారు. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి సినిమా అనగానే మంచి నిర్ణయమే అనే కామెంట్లు వచ్చాయి. అయితే.. ప్రశాంత్ వర్మ అంతా తనకే కావాలన్నట్టుగా అన్నింటిలో ఇన్ వాల్వ్ అవుతున్నాడట. అంటే.. సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ కూడా తనే చూసుకుంటానని అంటున్నాడట. ఇక్కడే మోక్షజ్ఞ టీమ్ తో ప్రశాంత్ వర్మకు విభేదాలు వచ్చాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ప్రశాంత్ వర్మ కథ అందించిన దేవకీనందన వాసుదేవ సినిమా ఫ్లాప్ అవ్వడంతో బాలకృష్ణ ఆలోచనలో పడ్డారట. అందుకనే ఈ సినిమా ఓపెనింగ్ వరకు వచ్చి ఆగింది. దీంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ ప్రచారం ఊపందుకుంది. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదు.. ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుంది.. కాకపోతే ఓపెనింగ్ పోస్ట్ పోన్ అయ్యిందంతే అని క్లారిటీ ఇచ్చారు. కొత్త సంవత్సరం వచ్చింది కానీ.. ఎప్పుడు ఈ మూవీని స్టార్ట్ చేస్తారో ప్రకటించలేదు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని టాక్ వినిపిస్తోంది.