నానికి విలన్ గా మోహన్ బాబు ?

నాని ప్రస్తుతం హిట్ 3 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మే 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత నటించే మూవీ ఫ్యారడైజ్. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్యారడైజ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి లెటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ప్యారడైజ్ చిత్రంలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా.. చాలా కొత్తగా డిజైన్ చేశారట. ఈ పాత్ర కోసం నటుడు మోహన్ బాబును కాంటాక్ట్ చేశారని తెలిసింది. మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమా ప్రమోషన్స్, రిలీజ్ హడావిడిలో ఉన్నాడు. అందుచేత కన్నప్ప రిలీజ్ తర్వాత తన నిర్ణయం చెబుతాను అన్నారట. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల విలన్ కొత్తగా ఉండేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. నానికి విలన్ గా మోహన్ బాబు కనిపించడం అనే న్యూస్ ఆసక్తికరంగా మారింది.