సినిమాకు హైప్ వచ్చేది ట్రైలర్ తోనే. సినిమా రిలీజ్ ముందు విడుదల చేసే ట్రైలర్ ఎంత బాగుంటే మూవీ అంత బజ్ క్రియేట్ అవుతుంది. ఓపెనింగ్స్ పై దాని ప్రభావం అంత బాగా ఉంటుంది. ఈ విషయంలో రామ్, బోయపాటి స్కంధ మూవీ పెద్ద ఇంపాక్ట్ చూపించలేదనే టాక్ వినిపిస్తోంది. రొటీన్ బోయపాటి ఫార్ములా ట్రైలర్ లో స్పష్టంగా కనిపించిందని ఫిల్మ్ లవర్స్ చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియాలోనూ స్కంధ ట్రైలర్ పై మీమ్స్, ట్రోల్స్ బాగా వస్తున్నాయి. ట్రైలర్ లో విపరీతమైన హింస, బోయపాటి గత సినిమాల టైప్ లో అవే షాట్స్, అవే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ నుంచి స్టాండర్డ్ ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయంటున్నారు. ఇక బీజీఎం ట్రైలర్ కు ఏమాత్రం సెట్ కాలేదు. డైలాగ్స్ తేలిపోయాయి. స్కంధ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన వాటిలో ఫస్ట్ థండర్ ఒక్కటే మళ్లీ మళ్లీ చూసేలా ఉంది. ఫస్ట్ థండర్ లో….నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా…అనే ఒక్క డైలాగ్ ఇంపాక్ట్ కూడా స్కంధ మొత్తం ట్రైలర్ చూపించలేకపోయింది.
మేకింగ్ నుంచి స్కంధ బడ్జెట్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది. డైరెక్టర్ బోయపాటి, రామ్ రెమ్యునరేషన్స్ తో పాటు సుదీర్ఘంగా సాగిన షూటింగ్ ప్రాసెస్ బడ్జెట్ భారాన్ని బాగా పెంచేసింది. స్కంధ ఎంత పెద్ద హిట్ అయినా ఈ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ అయితే అదే చాలు అనే పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాల టాక్.