‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ ఏడాది సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఒకటి. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ ప్లెజంట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కిక్ స్టార్ట్ చేసింది మూవీ టీమ్. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ చేయబోతున్నారు.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.