భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించింది హీరోయిన్ కీర్తి సురేష్. గతంలో ఆమె పెద్దన్న సినిమాలో రజినీకాంత్ చెల్లి క్యారెక్టర్ లోకనిపించింది. భోళా శంకర్ ఈ నెల 11న రిలీజ్ వస్తున్న నేపథ్యంలో సినిమాలో పనిచేసిన ఎక్సీపిరియన్స్ ఇంటర్వ్యూస్ లో చెబుతోంది కీర్తి. ఈ సందర్భంగా ఆమె చిరంజీవితో మాట్లాడిన కొన్ని సందర్భాలను షేర్ చేసింది. వాటిలో కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి.
అవన్నీ కీర్తి సురేష్ మాటల్లో వింటే – నేను భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి అమ్మ మేనకకు చెప్పాను. ఆమె చిరంజీవి గారితో కలిసి నటించిన పున్నమినాగు సినిమా నాటి సంగతులు నాతో చెప్పారు. ఆమెకు చిరంజీవి గారు ఎంత సపోర్ట్ చేసేవారో వివరించారు. ఆ సంగతులన్నీ చిరు గారికి భోళా సెట్ లో చెప్పాను. ఆయన నవ్వుతూ అంతే చెప్పిందా..నేను చాలా విషయాలు ఆమెకు చెప్పానే అన్నారు. ఇక రోజూ సెట్ లో చిరంజీవి గారి ఇంటి నుంచే నాకు భోజనం వచ్చేది. అడిగి మరీ వంటకాలు తెప్పించుకున్నా. అని అంది.
భోళా శంకర్ సినిమాలో అన్నా చెల్లెలు బాండింగ్ ఆకట్టుకునేలా ఉంటుందని, ఇది తన కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ అని కీర్తి తెలిపింది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ రూపొందించారు. ఇవాళ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక జరుపుతున్నారు.