గుమ్మడికాయ కొట్టబోతున్న “విశ్వంభర”

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఓ వారం రోజుల షూటింగ్ తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది. దీంతో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి రిలీజ్ కు రావాల్సిన విశ్వంభర రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వల్ల వాయిదా వేశారు.

ఈ సినిమా మేలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే రిలీజ్ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దర్శకుడు వశిష్ట్ రూపొందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ విశ్వంభర రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.