మెగాస్టార్ సునామీ రాబోతోందా?

భోళా శంకర్ రిజల్ట్ తో అభిమానులు బాధపడ్డారు. హేటర్స్ పండగ చేసుకున్నారు. మెగాస్టార్ కలత చెందారు. బయ్యర్లు నష్టపోయారు. బాక్సాఫీస్ దగ్గర చిరు ఛర్మిస్మా మసకబారింది. ట్రోల్స్, మీమ్స్ విజృంభించాయి. గత కొద్ది రోజులుగా ఇవన్నీ జరిగాయి. కానీ మెగాస్టార్ ఒక వటవృక్షం ఒక్క గాలి వానకు నేలవాలుతుందా? ఇలాంటివెన్నో తట్టుకుని నిలబడింది. ఇకపైనా నిలబడుతుంది. మెగాస్టార్ అలాంటి పట్టుదలనే చూపించబోతున్నారా?

చిరంజీవి తన పుట్టినరోజు రెండు సినిమాలు ప్రకటించారు. ఒకటి యూవీ క్రియేషన్స్ లో వశిష్ట దర్శకుడిగా పూర్తి స్థాయిలో ప్రకటన వెలువడగా..ఇంకోటి చిరు 157 కంప్లీట్ అనౌన్స్ మెంట్ రాలేదు. చిరు తనయ సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించనుంది. ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణను దర్శకుడిగా అనుకుంటున్నారు.

ఈ రెండు సినిమాల్లో యూవీ క్రియేషన్స్, వశిష్ట సినిమా మీద ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ చూస్తే…దీన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించబోతున్నారట. అలాగే ఈ సినిమాను భారీ విజువల్ ఎఫెక్టులతో ఒక విజువల్ వండర్ గా తీర్చాలని టీమ్ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. సినిమాలోని చాలా పోర్షన్స్ విదేశాల్లో షూటింగ్ చేయబోతున్నారని సమాచారం. ఇలా ఒక భారీ పాన్ ఇండియా మూవీతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర బౌన్స్ బ్యాక్ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.