మెగాస్టార్ మెగా పార్టీ ప్లాన్ చేస్తున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి.. చరణ్, ఉపాసన దంపతులకు పిల్లలు పుట్టాలని 11 సంవ్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే.. ఇన్నాళ్లకు పాప పుట్టింది. దాంతో మెగా ఫ్యామిలీ చాలా హ్యాపీ మూడ్ లో ఉంది. చరణ్ కు పాప మంగళవారం పుట్టింది. మెగా ఫ్యామిలీ ఆరాధ్య దైవం ఆంజనేయుడు. అందుకనే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లోగోలో కూడా ఆంజనేయుడే ఉంటాడు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే మంగళవారం రోజున పాప పుట్టడం సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. ఆ ఆంజనేయుడు ప్రసాదంగా ఫీలవుతున్నారు.

ఇంత ఆనందంలో ఉండడంతో మెగాస్టార్ మెగా పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నారట. త్వరలోనే మెగాస్టార్ ఇండస్ట్రీ మిత్రులకు పెద్ద పార్టీ ఇవ్వనున్నారట. ధూమ్ ధామ్ గా మెగా రాకుమారి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఉంటాయి. మరో వైపు, రామ్ చరణ్, ఉపాసన తమ కూతురుకి ఏమి పేరు పెడతారని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. ఇటీవలే వరుణ్, లావణ్య ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ సంవత్సరంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. చరణ్‌ గ్లోబర్ స్టార్ అయ్యాడు. అన్ని రకాలుగా మంచి జరగడంతో మెగాస్టార్ ఫుల్ జోష్ లో ఉన్నారు.