మెగాస్టార్ మెగాహార్ట్ – ఫిష్ వెంకట్ కు సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్(Fish venkat) కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi). ఆర్థిక పరిస్థితి బాగా లేక చికిత్స తీసుకోవడం లేదు ఫిష్ వెంకట్. అతని పరిస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి స్పందించి ఫిష్ వెంకట్ కు అండగా నిలబడేందుకు నిర్ణయించారు. ఫిష్ వెంకట్ కు ఉచితంగా వైద్య సహాయాన్ని అపోలో ఆస్పత్రిలో అందిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చారు.

కరోనా టైమ్ నుంచి తన ఛారిటీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేశారు మెగాస్టార్. పాత్రికేయులకు, నటీనటులకు, 24 క్రాఫ్టుల వారికి తన వంతు సాయం చేస్తున్నారు. తమిళ నటుడు పొన్నాంబలంకు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల కేర‌‌ళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం చరణ్ తో కలిసి మెగాస్టార్ రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఇలా మెగాస్టార్ గొప్ప మనసు చాటుకుంటున్నారు.