ప్రజా సేవలో అద్భుతాలు చేయాలి – పవన్ కు చిరు బర్త్ డే విశెస్

జనసేన(Janasena) అధినేతగా ప్రజా సేవలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) అద్భుతాలు చేయాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi). పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. పేద ప్రజల ఇంటి పెద్ద బిడ్డగా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని…అతను అనుకున్నది సాధిస్తాడనే నమ్మకం ప్రజలతో పాటు తనకూ ఉందని మెగాస్టార్ తన ట్వీట్ లో ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ తమ్ముడిని దీవించారు.

మెగాస్టార్ ట్వీట్ చూస్తే – కళ్యాణ్ బాబు…ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ!..అని ఆశీర్వదించారు.