డబ్బింగ్ పనుల్లో మెగాస్టార్ ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) విశ్వంభర (Vishwambhara) సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు (Dubbing) మొదలయ్యాయి. ఈ రోజు పూజతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు దర్శకుడు వశిష్ట (Director Vassista). విశ్వంభర సినిమా ఎంత స్పీడ్ గా జరుగుతుందో డబ్బింగ్ వర్క్స్ బిగిన్ తో తెలుస్తోంది. చాలా కంఫర్ట్ గా సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మేజర్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. విశ్వంభర భారీ సోషియ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ టైమ్ కేటాయిస్తారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ (UV creations) బ్యానర్ నిర్మిస్తున్న విశ్వంభర చిత్రంలో అషికా రంగనాథ్ (Ashika ranganath), త్రిష (Trisha) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే జవరి 10న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.