ఓటీటీ వరల్డ్ లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఒక సెన్సేషన్. ఈ సిరీస్ సక్సెస్ ఇండియాలో ఓటీటీ కంటెంట్ కు క్రేజ్ తీసుకొచ్చింది. వెబ్ సిరీస్ లలో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత కీ రోల్స్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను తెలుగు దర్శక ద్వయం రాజ్ డీకే రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ వీళ్లకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ కథతో వెబ్ సిరీస్ చేసేందుకు దర్శకులు రాజ్ డీకే మొదట మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించారట. వైజయంతీ మూవీస్ నిర్మాత అశ్వనీదత్ ద్వారా చిరంజీవిని అప్రోచ్ అయి ఆయనతో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేయాలనుకున్నారట. అయితే అప్పటికే మెగాస్టార్ తన రీఎంట్రీ మూవీ పనుల్లో ఉండటం వల్ల వెబ్ సిరీస్ ల పట్ల ఆసక్తి చూపించలేదు. పైగా అప్పటికి ఓటీటీలు ఇంత సక్సెస్ అవుతాయని, వెబ్ సిరీస్ లు ఇంత ప్రేక్షకాదరణ పొందుతాయని చిరంజీవి కూడా ఊహించి ఉండరు.
అలా మెగాస్టార్ ఖాతాలో నుంచి ఓ సూపర్ హిట్ వెబ్ సిరీస్ చేజారింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేయనంత మాత్రాన చిరంజీవి స్టార్ డమ్ కు, ఆయన ఘనతకు వచ్చిన ఢోకా ఏం లేదు. అయితే మెగాస్టార్ ను ఓ డిఫరెంట్ ప్లాట్ ఫామ్ మీద ఓ సక్సెస్ ఫుల్ సిరీస్ లో చూసే అవకాశం కలిగేది.