ఆ ముగ్గురు డైరెక్టర్స్ కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న విశ్వంభర మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. కొంత టాకీ.. అలాగే ఓ ఐటం సాంగ్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేయడానికి షూట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి.. ఈ మూవీ తర్వాత సినిమా చేసేందుకు ఆల్రెడీ డైరెక్టర్ ను ఫిక్స్ చేశారు. అతనే.. శ్రీకాంత్ ఓదెల. దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో ప్యార్ డైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫినిష్ చేసి మెగాస్టార్ తో మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నాడు.

శ్రీకాంత్ ఓదెలతో సినిమా తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడితో మూవీ చేయనున్నారు. అనిల్ రావిపూడికి చిరంజీవితో సినిమా చేయాలనేది డ్రీమ్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కానీ.. కుదరలేదు. ఇటీవల చిరుకు అనిల్ రావిపూడి స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అనిల్ రావిపూడి.. తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ 200 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో అనిల్ రావిపూడికి మరింత డిమాండ్ పెరిగింది.

ఈ టైమ్ లో చిరుతో అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ చేస్తే.. మరింత ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం. శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి తర్వాత చిరు ఎవరితో సినిమా చేయనున్నారంటే.. బాబీ పేరు వినిపిస్తోంది. బాబీతో చిరు వాల్తేరు వీరయ్య అనే సినిమా చేయడం.. ఆ సినిమా హిట్ కావడం తెలిసిందే. అప్పుడే మళ్లీ సినిమా చేయాలి అనుకున్నారట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్. ఈ విధంగా శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి, బాబీ.. ఈ ముగ్గురుతో చిరు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.