మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి చేస్తున్న సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారు, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనే విషయాలపై క్యూరియాసిటీ ఏర్పడుతోంది. షైన్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఈ మెగా మూవీ పూజా కార్యక్రమాలతో ఉగాది రోజున ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా చంటబ్బాయ్, గ్యాంగ్ లీడర్ చిత్రాల తరహాలో ఉంటుందని టాక్. మెగా ఎంటర్ టైనర్ చేస్తామంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి చెబుతున్నారు. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.