మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. వాటిలో ఒక సినిమాను మెగా157 అనే వర్కింగ్ టైటిల్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై బింబిసార దర్శకుడు వశిష్ట పొందిస్తుండగా..రెండో సినిమాను డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తారు. ఈ సినిమాను మెగా156 అని పిలుస్తున్నారు. ఈ సినిమాను చిరు కూతురు సుస్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మించనుంది.
వశిష్టతో సినిమా ఇప్పటికే అనౌన్స్ అయి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకుంది. కల్యాణ్ కృష్ణ సినిమా నుంచి అప్ డేట్ రావడం లేదు. లేటెస్ట్ టాక్ ప్రకారం కల్యాణ్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మూవీ నెక్ట్ మంత్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నా…షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంత త్వరగా చేయలేమని నిర్ణయానికి వచ్చారట. మరో మూడు నాలుగు నెలలు ఆలస్యమైనా వేసవిలో కంఫర్ట్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.