మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. వాటిలో ఒకటి యూవీ క్రియేషన్స్ సంస్థలో బింబిసార దర్శకుడు వశిష్ట రూపొందించే సినిమా కాగా..రెండోది చిరు కూతురు సుస్మిత సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణంలో దర్శకుడు కల్యాణ్ కృష్ణ చేయాల్సిన సినిమా. ఈ సినిమాకు మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఈ సినిమా ఆగిపోయినట్లు కన్ఫర్మ్ అవుతోంది.
ఈ సినిమాను నిర్మించాలనుకున్న సుస్మితకు అడ్వాన్స్ రూపంలో కోటి రూపాయలకు పైగా ఖర్చయ్యిందని, ఇప్పుడా నష్టాల లెక్కలు వేస్తున్నారట. కల్యాణ్ కృష్ణతో ఇక ఈ సినిమా ఉండకపోవచ్చని అంటున్నారు. సుస్మితకు మరో సినిమా చేస్తానని చిరంజీవి మాటిచ్చారట. దీంతో మెగా 156 కథ ముగిసినట్లే అనుకోవాలి.
అయితే యూవీ క్రియేషన్స్ లో వశిష్టతో చేస్తున్న మెగా 157 సినిమా మాత్రం స్పీడ్ గా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోకి దిగింది. నెక్ట్ ఇయర్ జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో టీమ్ ఉన్నారు. సోషియో ఫాంటసీ కథతో భారీ బడ్జెట్ తో మెగా 157 రూపొందనుంది.