సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఈ భామకు అడివి శేష్ సరసన నటించిన హిట్ 2 మంచి విజయాన్ని అందించింది. ఈ సక్సెస్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది మీనాక్షి. తెలుగులో వెంకటేష్ సరసన సైంధవ్, మహేశ్ బాబుతో గుంటూరు కారం సినిమాల్లో నటిస్తోంది.
విశ్వక్ సేన్ సరసన ఓ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ అనే సినిమా దక్కించుకుంది. ఇలా టాలీవుడ్ లో శ్రీలీల తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారింది మీనాక్షి. ఇప్పుడీ హీరోయిన్ తమిళ చిత్ర పరిశ్రమలోనూ లక్ చెక్ చేసుకోనుంది. ఆమె ఇప్పటికే అక్కడ ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తమిళ స్టార్ విజయ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న కొత్త సినిమాలో మీనాక్షిని హీరోయిన్ గా తీసుకుంటున్నారట. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే తమిళంలో మీనాక్షి బిజీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు, తమిళంలో యంగ్ హీరోయిన్స్ లేని లోటును మీనాక్షి ఇలా కవర్ చేస్తోంది.