‘ఆహా’లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన “మట్టి కథ”

అజయ్ వేద్, మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన మట్టి కథ సినిమా ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి నిర్మించగా..పవన్ కడియాల దర్శకత్వం వహించారు. మట్టి కథ సినిమా ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడు కేటగిరీల్లో అవార్డులతో పాటు 9 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది.

అంతర్జాతీయ అవార్డులతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిందీ సినిమా. గత నెల 22న థియేటర్స్ లో రిలీజైన మట్టి కథ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ హైటెక్ సిటీగా మారుతున్న టైమ్ లో నగర శివారు గ్రామంలోని ఓ యువకుడు పొలం అమ్ముకుని హైదరాబాద్ వెళ్దామని అనుకుంటాడు. సిటీ హంగులకు ఆకర్షితుడు అవుతాడు. పొలంతో అనుబంధం కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు ఒప్పుకోరు. మట్టితో రైతుకు ఉన్న రిలేషన్ చూపిస్తూ ఎమోషనల్ గా సాగుతుందీ సినిమా.