మాస్ లుక్ నాగ్. ఇంతకీ సినిమా ఎప్పుడు..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ అంటూ యాక్షన్ మూవీస్ చేస్తే జనాలు చూడలేదు. అదే.. బంగార్రాజు అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూస్తే.. జనాలు చూశారు. అందుచేత యాక్షన్ మూవీస్ కాకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ యాక్షన్ అనేలా సినిమా చేయాలి అనుకుంటున్నాట. ది ఘోస్ట్ మూవీ రిలీజై ఎనిమిది నెలలు అయ్యింది కానీ.. ఇంత వరకు కొత్త సినిమా ఎవరితో..? ఎప్పుడు..? అనేది ప్రకటించలేదు. అదిగో అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది.. ఇదిగో అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది అని వార్తలు రావడం తప్పా… కొత్త సినిమా కబురు అయితే మాత్రం రావడం లేదు.

ఇదిలా ఉంటే… దర్శకుడు దశరథ్ నిర్మించిన లవ్ యు రామ్ సినిమా సాంగ్ ను నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో నాగ్ హెయిర్ పెంచి.. లైట్ గా గెడ్డంతో మాస్ లుక్ లో కనిపించారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొత్త సినిమా వార్త ఎప్పుడు చెబుతావ్ బాసు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొత్త సినిమా కోసమే ఈ లుక్ అని టాక్ వినిపిస్తుంది. ఈ నెలలో కొత్త సినిమా విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా బెజవాడ ప్రసన్నతో సినిమా చేస్తారో..? వేరే డైరెక్టర్ తో అనౌన్స చేస్తారో చూడాలి.