క్లాస్ డైరెక్టర్ తో మూవీ చేస్తున్న మాస్ హీరో

కిషోర్ తిరుమల క్లాస్ డైరెక్టర్. సక్సెస్ ఫుల్ మూవీస్ అందించాడు. అయితే.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక కెరీర్ లో వెనబడ్డాడు. ఆ మధ్య సాయిదుర్గ తేజ్ తో చిత్రలహరి మూవీకి సీక్వెల్ తీయనున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ.. సెట్ కాలేదు. ఇటీవల రవితేజతో మూవీ అంటూ వార్తలు వచ్చాయి కానీ.. క్లారిటీ లేదు. ఇటీవల మాస్ మహారాజా రవితేజకు ఓ క‌థ చెప్పార‌ని, ఈ సినిమా ఆల్మోస్ట్ ఓకే అయ్యింద‌ని ఇండస్ట్రీలో వినిపించింది. కిషోర్ తిరుమ‌ల‌ది క్లాస్ ట‌చ్. ర‌వితేజ ఫుల్ మాస్‌. మ‌రి వీరిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా వ‌స్తుంద‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా కిషోర్ తిరుమ‌ల అనార్క‌లీ అనే ఓ క‌థ‌ని రెడీ చేశారట. అనార్క‌లి టైటిల్ బాగుంది. కాక‌పోతే.. ఈ టైటిల్ వింటుంటే ల‌వ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇలాంటి సాఫ్ట్ టైటిల్ ర‌వితేజ‌కు సెట్ అవ్వ‌దు. కాబ‌ట్టి.. ఇది వేరే హీరో కోసం రాసిన స్టోరీ అనిపిస్తోంది. ర‌వితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. మాస్ జాతర‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇది కాకుండా మ‌రో రెండు క‌థ‌లు ఫైన‌ల్ చేశారు. అందులో మ్యాడ్ ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ శంక‌ర్ క‌థ కూడా వుంది. మాస్ జాత‌ర‌ త‌ర్వాత క‌ల్యాణ్ సినిమానే ప‌ట్టాలెక్కుతుంద‌ని, అది.. 2026 సంక్రాంతికి విడుద‌ల అవుతుంద‌ని ఇన్ సైడ్ టాక్. అయితే.. కిషోర్ తిరుమల రవితేజతో మూవీ చేస్తాడో.. లేక వేరే హీరోతో సినిమా చేస్తాడో ఇప్పటికైతే క్లారిటీ లేదు