ఉన్ని ముకుందన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో టెలివిజన్ ప్రీమియర్ ను బ్యాన్ చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. ఈ సినిమా టీవీ ప్రదర్శనను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ ను నిలిపివేయాలంటూ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖను సీబీఎఫ్ సీ కోరింది. విపరీతమైన హింస చూపించిన మార్కో సినిమా ప్రేక్షకుల మానసిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని సీబీఎఫ్ సీ అభిప్రాయపడింది.
మార్కో చిత్రాన్ని దర్శకుడు హనీఫ్ అడేని రూపొందించారు. క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. ఉన్ని ముకుందన్ తో పాటు సిద్ధిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఒక మనిషిని ఎన్ని రకాలుగా చంపవచ్చో అన్ని పద్ధతుల్లో హీరో విలన్స్ ను చంపుతుంటాడు. మోస్ట్ వయలెంట్ మలయాళ ఫిల్మ్ గా మార్కో పేరు తెచ్చుకుంది.