‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్ మంగ్లీ వెర్షన్ వచ్చేసింది

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ (ARVI cinemas) పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’(ARI). ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జయశంకర్ (Jayashankar) దర్శకత్వం వహించిన ‘అరి’ సినిమా త్వరలో విడుదల సిద్ధమవుతోంది. రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ‘అరి’ సినిమా నుంచి చిన్నారి కిట్టయ్య లిరికల్ సాంగ్ మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ పాట విడుదలై హిట్ అయింది. ఇప్పుడు చిన్నారి కిట్టయ్య (Chinnari kittayya) పాట మంగ్లీ వెర్షన్ ను కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.

బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ – ‘అరి’ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూశాను. చాలా బాగుంది. ఈ మూవీ డైరెక్టర్ జయశంకర్ గతంలో పేపర్ బాయ్ అనే మంచి మూవీ రూపొందించారు. ఆ సినిమా ఆయనకు దర్శకుడిగా పేరు తీసుకొచ్చింది. ‘అరి’ సినిమా కూడా ఆయన సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ‘అరి’ సినిమాలో ‘చిన్నారి కిట్టయ్య’ పాట మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.